Featured

Actor Nagineedu : ఏ కష్టమొచ్చినా ముందుండేది ఒక్క సి.కళ్యాణ్ మాత్రమే… నేను వ్యాపారాల్లో చాలా నష్టపోయాను : నాగినేడు

Actor Nagineedu : మర్యాద రామన్న సినిమాలో విలన్ గా సరికొత్త విలనిజం చూపించిన నాగినీడు గారు సినిమాలకు ముందు ఆయన ఏం చేసేవారు అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన మర్యాద రామన్న సినిమా తరువాత ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. రాయలసీమ యాసలో ఫ్యాక్షనిస్ట్ గా నటించిన ఆయన ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆయన సినిమాలకంటే ముందు ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసేవారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న నాగినీడు గారు కొన్ని సినిమాల విషయంలో ప్రసాద్ ల్యాబ్ సంస్థ ఎన్ని డబ్బులను కోల్పోయారో వివరించారు. ఇక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమా విడుదలకు థియేటర్లు వెతుక్కోవడం పోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో వైరుద్యాల గురించి మాట్లాడారు.

పంచాయితీ చేసి ఎన్నో సినిమాలను విడుదల అయ్యేలా చేసింది ఆయనే…

సినిమా మొదలు పెట్టినపుడు డైరెక్టర్ నిర్మాత కొత్తగా పెళ్ళైన జంటలాగా అన్యోన్యంగా ఉంటారు. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ అప్పుడు బడ్జెట్ అంచనాలు వేరుగా ఉంటాయి, ఎప్పుడైతే సినిమా పూర్తి కావొస్తోందో అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కి కొన్నిసార్లు బడ్జెట్ ఉండదు. లేకపోతే విడాకులు తీసుకోవాలని అనుకున్న జంటలాగా డైరెక్టర్, నిర్మాత మారిపోతారు. అలాంటి సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ల్యాబ్ కి వస్తారు. డబ్బు కట్టకపోతే ప్రింట్ బయటికి రాదు అలాంటి సమయంలో పెద్ద మనిషిలాగా సి కళ్యాణ్ చాలా సినిమాలకు వ్యవహరించి ఆయన పూచికత్తు మీద సినిమాను బయటికి పంపే ఏర్పాటు చేసారు. ఇరు పార్టీలను నొప్పించకుండా ఆయన డీలింగ్ చేస్తారు.

ఒక సినిమా విడుదలకు ఎలాగైనా సహకరిస్తే సినిమా థియేటర్ కి వెళితే వాళ్లకు డబ్బులు వస్తాయి అపుడు మాకు బిల్ పేమెంట్ ఇస్తారనే నమ్మకంతో సినిమా బయటికి వచ్చేందుకు మేము ప్రయత్నిస్తాం అంటూ నాగినీడు గారు అభిప్రాయపడ్డారు. ఇక తాను ప్రసాద్ ల్యాబ్ లో పనిచేస్తున్న సమయంలో అక్కడి నుండి బయటికి వచ్చి సొంతంగా వ్యాపారం చేసి చాలా నష్టపోయాను, అది కూడా ఒకసారి కాదు చాలా సార్లు. అప్పుడు దేవుడు నేను తప్పు చేసాను కాబట్టి మోటిక్కాయ వేసాడు అనుకుంటా అంతే. ఇక ఇపుడు వ్యాపారం అవి ఆలోచనలు మానేసాను అంటూ ఆయన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

42 minutes ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

48 minutes ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

48 minutes ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

2 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

2 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

2 hours ago