Featured

Actor Nagineedu : కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు… అరుంధతి సినిమా విషయంలో జరిగింది అదే…: యాక్టర్ నాగినీడు

Actor Nagineedu : ‘మర్యాద రామన్న’ సినిమాలో విలన్ గా సరికొత్త విలనిజం చూపించిన నాగినీడు గారు అంతకు ముందు ఆయన కెరీర్ సినిమాలకు ముందు ఆయన ఏం చేసేవారో అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన మర్యాద రామన్న సినిమా తరువాత ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. రాయలసీమ యాసలో ఫ్యాక్షనిస్ట్ గా నటించిన ఆయన ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆయన సినిమాలకంటే ముందు ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసేవారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న నాగినీడు గారు కొన్ని సినిమాల విషయంలో ప్రసాద్ ల్యాబ్ సంస్థ ఎన్ని డబ్బులను కోల్పోయారో వివరించారు.

అరుంధతి సినిమా సమయంలో జరిగింది అదే…

ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసిన సమయంలో చాలా సార్లు సినిమాల విషయంలో పేమెంట్ కొంత సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తామని చెప్పి, సినిమా సరిగా ఆడకపోయినా డబ్బు సంస్థకు రాదు, అలాంటి బాకీలు చాలానే ఉంటాయి ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారికి అంటూ చెప్పారు. ప్రసాద్ లాబ్స్ రమేష్ గారికి మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు ఎంఎస్ రెడ్డి గారికి మంచి పరిచయం ఉంది. అందుకే వారి సినిమాకు పనిచేసినపుడు కుటుంబం కలిసి పనిచేసినట్లు ఉంటుంది అంటూ చెప్పారు. అరుంధతి సినిమా సమయంలోనూ ల్యాబ్ ద్వారా సమస్యలను క్లియర్ చేసాం.

అప్పుడు ఆ సినిమా సమస్యలను ఎలా క్లియర్ చేసామో ఇపుడు గుర్తు లేదు అంటూ చెప్పారు. ఇక ఒక పెద్ద హీరో సినిమా విషయంలో ఇలాగే జరిగినపుడు రమేష్ గారు ఆఫీస్ లో లేరు సినిమా విడుదల అవ్వాలి కానీ వాళ్ళు అప్పటికే 70 లక్షల దాకా ప్రసాద్ ల్యాబ్ కి బాకీ పడి ఉన్నారు. అప్పుడు ప్రింటింగ్ పనులు సంస్థలు చేయకపోతే సినిమా విడుదల కాదు అనే ఉద్దేశంతో నేనే నిర్ణయం తీసుకుని ప్రింటింగ్ చేయించి ఇచ్చాము. అది నేను సహాయం అనుకోను వ్యాపారం అంతే అంటూ చెప్పారు నాగినీడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago