Categories: FeaturedMovie News

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?

The Kashmir Files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకున్న అంశాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ఒకటి. దేశవ్యాప్తంగా అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదల అయ్యి ప్రశంసలు అందుకోవడం తోపాటు, జనాలకు కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?

జనాలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా సరికొత్త రికార్డులను, చరిత్ర ను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మొదటి రోజు ఆరు వందల స్క్రీన్లలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాపై ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపిస్తుండటంతో ఈ సినిమా స్క్రీన్ కౌంటర్ ను 600 నుంచి 2000 కు పెరిగింది. రోజు రోజుకీ ఈ సినిమాకు షోలు కూడా రెట్టింపు అవుతు స్క్రీన్లు మరిన్ని పెరుగుతున్నాయి.

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?

ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేకుండా అన్ని దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమాకు దాదాపుగా నూరు కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అనుపమ కేర్, అదేవిధంగా మిథున్ చక్రవర్తి, పల్లవి జోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు స్పందించడమే కాకుండా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు పల్లవి జోష్ అభిషేక్ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.

ప్రశంసలు కురిపిస్తున్నారు సెలబ్రిటీలు….

ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకు గాను చిత్ర బృందానికి నరేంద్రమోడీ అభినందనలు తెలిపిన అనంతరం సినిమాపై ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీతో పాటుగా ఈ సినిమాపై అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా? లేక తిరిగి ఆ గాయాలను రేపుతుందా? దేశం అనే బీజాలను మళ్లీ నాటుతోందా? అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.. ఈ ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా సందిస్తూ..జస్ట్ అస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జతచేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago