Movie News

Actor Prathap Pothen: రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ఒంటరిగా మరణించిన ప్రతాప్ పోతేన్.. రాధికతో విడాకులకు కారణం అదేనా?

Actor Prathap Pothen: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా సినీ ప్రపంచం షాక్ కి గురైంది. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలోని తన ఇంటిలో వివిధ జీవిగా నటుడు ప్రతాప్ పోతేన్ మరణించారని తెలియడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈయన నటుడిగా తెలుగు తమిళ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ప్రతాప్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తన జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చివరికి ఒంటరిగా ఇంట్లో విగత జీవిగా మరణించడం అందరిని కలిచి వేసింది. ఈయన 1985 లోనటి రాధికను వివాహం చేసుకున్నారు అయితే వీరి వివాహమైన ఏడాదికే వీరిద్దరూ పరస్పర అభిప్రాయంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

Actress Radhika: చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో అయినా నటిస్తా కానీ… ఆ పాత్రలో మాత్రం నటించను: నటి రాధిక

ఇలా రాధికతో విడాకులు తీసుకున్న నాలుగు సంవత్సరాల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన ప్రతాప్ తిరిగి 1990లో అమల సత్యనాథన్ ను పెళ్లి చేసుకున్నారు ప్రతాప్. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా రెండవ భార్య నుంచి కూడా విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి ప్రతాప్ చెన్నైలో ఒంటరిగా ఉంటూ పలు సినిమాలలో నటిస్తూ ఉండేవారు.

రాధిక వ్యక్తిత్వం ఎంతో గొప్పది..

ఇకపోతే ఈయన రాధికతో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అయితే అప్పుడు ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాధిక గురించి మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని చెప్పడం గమనార్హం. అయితే మా ఇద్దరికీ మనస్పర్ధలు రావడం వల్ల ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయామని ఈయన గతంలో వెల్లడించారు.పెళ్లి అనేది అందరి జీవితానికి సరైనది కాదని, అది ఇరువురి ఆలోచనలు బట్టి ఉంటుందని చెప్పినట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago