Actor Rajeev Kanakala : దేవదాస్ కనకాల గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజీవ్ కనకాల మొదట సీరియల్స్ చేస్తూ ఆ తరువత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో హీరోగాను విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా చేసిన ప్రతి పాత్రకి న్యాయం చేసారు. ఇక తన భార్య సుమ కనకాల కూడా అటు బుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఉంటూ ఇటు సినిమాల్లోను ఇంకా యూట్యూబ్ లో కూడా సొతం ఛానెల్ తో దుమ్ములేపుతోంది. ఇక రాజీవ్ కనకాల ఈ మధ్య సినిమాలను చాలా వరకు తగ్గించారు. ఎన్టీఆర్, రాజీవ్ కాంబినేషన్ ఒకప్పుడు బాగా హిట్ కానీ యామదొంగ తరువత చాలా గ్యాప్ వచ్చింది. ఇక రాజమౌళితో కూడా ఎక్కువగా వర్క్ చేసిన రాజీవ్ ఆయన సినిమాల్లోను కనిపించకపోయే సరికి బయట బాగా రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ వాటిన్నిటి మీద రాజీవ్ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ అలాంటిది…
ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి ట్రావెల్ అవుతున్న రాజీవ్ ఆ సినిమా నుండి మంచి మిత్రులు అయ్యారు. ఇక వాళ్లిద్దరి కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చాయి. అయితే మధ్యలో గ్యాప్ రావడం గురించి రాజేవ్ మాట్లాడుతూ ఎవరి సినిమాలో వారు బిజీగా ఉండటం వల్ల అలా గ్యాప్ వచ్చింది కానీ మా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు అంటూ చెప్పారు.
ఎన్టీఆర్ నాకంటే వయసులో చాలా చిన్నవాడు అయినా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు అని చెప్పారు. తనకు నాతో కలిసి నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది అందుకే తన సినిమాల్లో నన్ను రికమెండ్ చేస్తుంటాడు. అలా నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో షూటింగ్ అప్పడు తనకు ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ ఇచ్చారు. నాకు మరికొంతమందికి సాధారణ హాటల్ లో రూమ్స్ ఇవ్వగా తాను ఆ హోటల్ వదిలి నా దగ్గరికి వచ్చేసాడు అంత వాల్యూ ఇస్తాడు ఫ్రండ్షిప్ అంటే అంటూ చెప్పారు రాజీవ్ కనకాల.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…