IPL @2023 : ఇండియాలో వేసవి వచ్చేసింది అలాగే ఐపిఎల్ ఫీవర్ మొదలలైపోయింది. వేలంలో అదిరిపోయే ధరలకు క్రికెటర్స్ అమ్ముడు బోయి కాస్ట్లీగా సాగుతున్న మ్యాచ్ లో కొంతమంది చెత్త ప్రదర్శన చూసి నెటిజన్స్ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయడం లేదంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొతమంది ప్లేయర్స్ సూపర్ గా ఆడుతున్నారని పొగిడేస్తున్నారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చిస్తున్న పేర్లు కావ్య మారన్ అలాగే తిలక్ వర్మ. వీళ్ళిద్దరికీ పరిచయం ఎక్కడ, ప్రస్తుతం వీళ్ళిద్దరి గురించి డిస్కషన్ ఏంటి అంటే ఈ ఆర్టికల్ చూసేయండి..
కోట్లు పెట్టి అలాంటివాళ్ళు అవసరమా కావ్య పాప…
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం ఓనర్ కావ్య మారన్. ఆమె ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా కోట్లు గుమ్మరించి ప్లేయర్స్ ను కొనుక్కుంది. అయితే ఆదివారం జరిగిన హైదరాబాద్ రాజస్థాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ లో హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయింది. రాజస్థాన్ ప్లేయర్స్ దాటికి ఇటు వికెట్లను అలాగే బౌలర్లు రన్నులను వారికి సమర్పించుకున్నారు. 13 కోట్లు పెట్టి మరీ కావ్య మారన్ హ్యారి బ్రూక్ ని కొంటే మ్యాచ్ లో కోటికి ఒక రన్ చొప్పున హ్యారి 13 రన్నులు తీసాడు మరి. చెప్పుకోదగ్గ ఆట అంటే అబ్దుల్ సమాన్ 32 నాటౌట్, మయాంక్ అగర్వాల్ 27 పరుగులు అంతే. అయితే మధ్యలో తిలక్ మ్యాటరేంటి అనేగా డౌటు. ఆదివారం నాడు మరో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
అదే ఆర్సిబి అలాగే ముంబై కి మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి తొలి బోని కొట్టింది. కోహ్లీ గురించే అందరూ మాట్లాడుకోవడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా కింగ్ కోహ్లీ కన్నా రెండు పరుగులు ఎక్కువ తీసి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు తిలక్ వర్మ. ముంబై ఆటగాడైన తిలక్ వర్మ టీం ఓడిపోయినా తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగు కుర్రడైన తిలక్ వర్మ లాంటి మెరికలను వదిలేసి కావ్య మారన్ హైదరాబాద్ టీంకి కోట్లు పెట్టి వేరే ప్లేయర్లను తీసుకుందని తక్కువ వేలంకే ఇలాంటి ప్లేయర్స్ వస్తారు కూడా, వాళ్ళను వదిలేసింది. అయినా హైదరాబాద్ టీంలో ఒక్కరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా అంటూ మరికొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…