Actor Ravi Krishna : మొగలి రేకులు సీరియల్ లో దుర్గా ప్రసాద్ గా తన నటన ప్రయాణం మొదలు పెట్టిన విజయవాడ కుర్రాడు రవికృష్ణ తాజాగా తాను నటించిన విరూపాక్ష సినిమాలో కుమార్ గా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం బుల్లితెర కు గుడ్ బై చెప్పి వెండి తెర మీద వరుస అవకాశాలతో దూసుకు పోతున్న రవికృష్ణ తన కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
నవ్యస్వామి తో రిలేషన్…
సీరియల్స్ తో మొదలు పెట్టిన రవి కృష్ణ మొదట మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తరువాత జీ తెలుగు లో వచ్చిన వరూదిని పరిణయం సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక లాస్ట్ సీరియల్ ఆమె కథ కూడా రవికృష్ణ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే బిగ్ బోస్ లో కూడా పాల్గొని ఈ అబ్బాయి మంచోడు అనిపించుకున్న రవి ఆన్ స్క్రీన్ నవ్యస్వామి తో సీరియల్ జోడిగా మంచి పేరు తెచ్చుకోవడం వల్ల తనతో కలిసి డాన్స్ షోలో హోస్ట్ గా ఉండటంతో తనతో రిలేషన్ లో ఉన్నాడంటూ బాగా వినిపించింది.
తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ అలాంటిదేమి లేదని తాను మంచి స్నేహితురాలు అంటూ తెలిపారు. ఇక పెళ్లి గురించి ఇపుడే ఆలోచన లేదని సినిమాల్లో బాగా స్టాండ్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ చెప్పాడు రవి. సీరియల్స్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న రవి వాటిని వదులుకుని సినిమాల వైపు రావడానికి రిస్క్ తీసుకున్నానని కానీ తప్పదని చెప్తూనే రెమ్యూనరేషన్ మాత్రం చెప్పలేదు. దాదాపు 45వేల నుండి యాభై వేల వరకు రోజు ఒక ఎపిసోడ్ కి వస్తుందని హింట్ ఇచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…