Actor Saikiran: వారిని నమ్మి లక్షల్లో మోసపోయిన నువ్వే కావాలి నటుడు సాయి కిరణ్.. పోలీసులకు ఫిర్యాదు?
Actor Saikiran: మోసం చేసే వాళ్ళు ఉంటే ఎలాంటి వారైనా మోసపోతారని అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఎంతో మంది చదువుకున్న మేధావులు పెద్దపెద్ద వ్యాపారస్తులు, సినీ సెలబ్రిటీలు సైతం ఇతరులను నమ్మి దారుణంగా మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే నువ్వేకావాలి సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి కిరణ్ సైతం దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
సాయి కిరణ్ నిర్మాత జాన్ బాబు , లివింగ్ స్టెన్‌ల పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరుతో సాయి కిరణ్ దగ్గర నుంచి వీరిద్దరూ రూ.10.6 లక్షల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారని డబ్బులు అడిగితే తనని బెదిరిస్తున్నారని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని జాన్ బాబు, లివింగ్ స్టెన్ లపై 420,406 సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇలా సాయికిరణ్ నిర్మాతల చేతిలో దారుణంగా మోసపోవడంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈయన కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ సింగర్ రామకృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికిరణ్ నువ్వే కావాలి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమాలలో హీరోగా నటించారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన బుల్లితెర టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
బుల్లితెర సీరియల్స్ మాత్రమే కాకుండా పలు వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, విష్ణు వంటి దేవుడి పాత్రలో కూడా ఈయన ఎంతో అద్భుతంగా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సాయికిరణ్ బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లో నటిస్తూ సాయికిరణ్ బిజీగా ఉన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…