Categories: FeaturedMovie News

Actor Shivaji : నీకే చెప్పేది హీరో.. మనిషిగా మారు…: నటుడు శివాజీ

Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీకి కేఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా యాంకర్ గా ఉన్న సమయంలోనే రాఘవేంద్ర రావు పరదేశి సినిమా ఆడిషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండగా పాల్గొని అందులో లయతో పాటు రెండో ప్లేస్ తెచ్చుకున్నాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఒక పెద్ధ ఆర్టిస్ట్ అలా చేస్తాడని అనుకోలేదు…

ఒక పేరున్న నటుడి తండ్రి చనిపోతే పరామర్శించడానికి వెళితే ఆ నటుడిని హత్తుకోబోతే చేతులు తీసేసాడు. హోదా ఉంటేనే హత్తుకోవాలని అపుడే అర్థమైంది. మళ్ళీ ఆ నటుడు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ పైకి కలరింగ్ ఇస్తుంటాడు. చివరికి అందరం చావాల్సిన వాళ్ళమే, ఒక చోటికి పోవాల్సిన వాళ్ళమే కానీ ఈ హోదా అంటూ ఎందుకు బ్రతుకుతారో అనిపించింది. ఇక మరో పెద్ధ ఆర్టిస్ట్ తో కలిసి ఒక పెద్ద ప్రొజెక్ట్ లో నటిస్తున్నపుడు రెమ్యూనరేషన్ అడిగాడు.

మన మనిషే కదా అని చెబితే ప్రొడ్యూసర్ వద్దకు వెళ్లి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులందరిలోనూ అతనికే ఎక్కువ ఇస్తున్నట్లున్నారు అంటూ మాట్లాడాడు. మళ్ళీ వాడొక పెద్ద ఆర్టిస్టు వాడికి గుర్తు రావాలనే చెబుతున్నా దేవుడు మంచి అవకాశాలను ఇచ్చాడు, పేరు సంపాదించుకున్నా మన అనుకున్నవాళ్లనే ఇలా చేసేవాళ్లను ఏమనాలి, మనిషి గా బ్రతకరా అంటూ ఫైర్ అయ్యాడు శివాజీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago