Actor Suman : వృద్ధ రాజకీయ నేత,తమిళ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ఆయనెవరో కాదు డీఎంకే అధినేత కరుణానిధి. చీకటి గదిలో బిక్కు,బిక్కు మంటూ కూర్చున్నా ఓ వ్యక్తి ఏడంతస్తుల భవనంలో పూలపాన్పుపై పవళించేవారు. మూషికాలు సంచరించే గదిలో కనిపించడంతో ఒక్కసారిగా ప్రతి పక్ష నేత కరుణానిధి అవాక్కయ్యారు. సినీ రంగంలో పేరుప్రఖ్యాతులు గాంచిన ఆ వ్యక్తిని అకారణంగా జైల్లో నిర్బంధించడం ఏమిటి, అతనిని చీకటి గదిలో ఉంచడం ఏమిటని? జైలు సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటే…
1985 తన ఇంటిలో గాఢంగా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అలికిడి వినబడింది. దానితో సుమన్ నిద్ర లేచారు. చుట్టూ పోలీసులు మోహరించారు. అది చూసిన ఆయన అవాక్కయ్యారు. అసలు జరుగుతుంది ఏమిటి?. తనని ఎందుకు? నిర్బంధించారు. అనే విషయం అతనికి ఎంతకు అర్థం కాకుండా పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది సుమన్ మాటల్లో.. 1985 మే 19 రోజున నేను అరెస్ట్ అయ్యాను. దాదాపు రెండు నుంచి మూడు వారాలపాటు జైలులో ఉన్నాను. అక్కడ నన్ను ఒక సెల్ లో ఉంచారు. నా పక్కనే పొలిటికల్ సెల్ ఒకటి ఉంటుంది. అందులో పొలిటిషన్ కరుణానిధి అరెస్ట్ కాబడి ఒక వారం రోజులపాటు ఉన్నారు. అక్కడ నన్ను ఆయన గమనించారు. నేనుండే సెల్ నాకు ఇచ్చే ట్రీట్మెంట్ చూసైనా చెలించిపోయి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ అది పొలిటికల్ ఇష్యూ అవుతుందని జైలు అధికారులు నా సెల్ మరొక చోటుకి షిఫ్ట్ చేశారు. అప్పుడంతా సద్దుమణిగింది.కరుణానిధి జైలు నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆయన రైటర్ గా పనిచేసిన ఒక సినిమాలో సుమన్ ని పెట్టుకోండని నన్ను రికమెండ్ చేశారు. ఒకప్పుడు నాతో ఖైదీగా ఉన్న కరుణానిధి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రైటర్ గా వర్క్ చేస్తున్న సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది. అది కరుణానిధి ఉన్నప్పుడు షూటింగ్ చేయండని దర్శకుడితో చెప్పారు. అలా తమిళ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి ఆయన వచ్చి మాతో చాలాసేపు షూటింగ్ లో గడిపారు. అయితే అప్పుడు నా మీద అభియోగం మోపింది నాన్ బెయిలబుల్ గూండా ఆక్ట్. ఆ ఆక్ట్ ఒకసారి మోపారంటే.. ఎవరికి కూడా బెయిల్ దొరకదు. కానీ నా కేస్ విషయంలో నిరాధారంగా అరెస్ట్ చేశారని.. కోర్ట్ ముందుగానే నాకు బెయిల్ ఇచ్చింది. సౌత్ ఇండియాలో గూండా యాక్ట్ ను బ్రేక్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేను. నాతోటి ఖైదీల్లో అకారణంగా జైలుకు వచ్చిన డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్ ఎంతోమంది ఉన్నారు. వారిని చూసి నేను చెలించిపోయాను. బయటికి వచ్చిన తర్వాత చట్టం, న్యాయస్థానాల పైన అవగాహన పెరిగిందని. ఇప్పుడు సమయం మనది కాదని నన్ను నేను సముదాయించుకున్నాను. మానసికంగా బలహీనంగా ఉన్న నేను ఆ తర్వాత చాలా దృఢంగా తయారయ్యానని. ఆ ఇంటర్వ్యూలో సుమన్ చెప్పుకొచ్చారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…