కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇప్పటికీ అభిమానులు, సినీ ప్రముఖులు తేరుకోలేకపోతున్నారు. ఎంతో మంచి నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రేక్షకుల మదిలో విశేష ఆదరణ సంపాదించుకున్న పునీత్ మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉండగా పునీత్ మరణం పై హీరో విశాల్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే విశాల్ నటించిన “ఎనిమి” సినిమా నవంబర్ 4వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో విశాల్ నటుడు పునీత్ ను గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పునీత్ నటుడిగా మాత్రమే కాకుండా 1,800 మంది పిల్లలను చదివిస్తూ వారి బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎన్నో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే పునీత్ మరణం తనని ఎంతో కృంగదీసిందని, పునీత్ తనకు ఒక మంచి మిత్రుడన్న విషయాన్ని ఈ సందర్భంగా విశాల్ వెల్లడించారు.
ఇక తన మిత్రుడి మరణానంతరం తన మిత్రుడి బాధ్యతలను తాను తీసుకుంటున్నానని ఇకపై 1800 మంది పిల్లల చదువులను, వారి బాగోగులను తాను చూసుకుంటానని ఈ సందర్భంగా విశాల్ ఈ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు హీరో విశాల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…