అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు అగ్ర దర్శకుడి కొడుకు నరేశ్. ప్రముఖ నటుడు రవిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. చుట్టుప్రక్కల ఉండేవారి జీవన విధానం ఎలా ఉంటుంది..సాధారణ జీవితాలలో నుంచి వచ్చే ఫన్ ఎలా ఉంటుంది.. అనే సింపుల్ పాయింట్‌తో కథ అల్లుకున్న రవిబాబు అల్లరి అనే సినిమాకు నరేశ్‌ను ఎంచుకోవడం కరెక్టే అని అందరూ మాట్లాడుకున్నారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకాధరణ పొందింది.
దాంతో నరేశ్ ఇంటిపేరే మారిపోయింది. మొదటి సినిమా నుంచి అల్లరి నరేశ్‌గా పాపులర్ అయ్యాడు. ఇతను హీరో ఏంటి అని కామెంట్ చేసిన వారు కూడా ఉన్నారు. నరేశ్ పర్సనాలిటీ.. వాలకం చూసి చాలా చులకనగా కామెంట్ చేసిన జనాలు లేకపోలేదు. అయినా స్టార్ డైరెక్టర్ కొడుకు.. కామెడి టైమింగ్ బావుంది..కామెడీ సినిమాలకు బాగా పనికొస్తున్నాడు. లో బడ్జెట్ సినిమాలు ఇలాంటి వారితో తీస్తేనే వర్కౌట్ అవుతుంది..అనే కొన్ని ప్లస్ పాయింట్స్ నరేశ్‌కు ఉండటంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
అయితే నరేశ్ జనాల కామెంట్‌ను కామెడీగా తీసుకున్నాడో లేక సీరియస్‌గా తీసుకున్నాడో తెలీదు గానీ.. సినిమా సినిమాకు తనను తానూ ఇంప్రూ చేసుకుంటూ వచ్చాడు. ప్రతీ సినిమాలో తన పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. దాంతో నరేశ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక దశ తర్వాత నరేశ్ సినిమా వస్తుందంటే కాసేపు వెళ్ళి సరదాగా నవ్వుకొని వద్దామని తన సినిమా కోసం థియేటర్స్‌కు వచ్చిన ప్రేకకులున్నారు. అలా నరేశ్‌కు టాలీవుడ్‌లో ఓ సపరేట్ మార్కెట్ ఏర్పడింది. తన కోసం మంచి కామెడీ కథలు తయారయ్యాయి. దర్శక, నిర్మాతలు తీసిన సినిమాకు సేఫ్‌గా రిటర్న్స్ రావాలాంటే మా హీరో అల్లరి నరేశ్ వల్లే అవుతుందని ఫిక్స్ అయ్యారు.
అలా నరేశ్‌తో సినిమా తీసిన దర్శక, నిర్మాతలు దాదాపుగా సేఫ్ జోన్‌లో ఉండేవారు. అంతేకాదు ఓ 20 సినిమాల తర్వాత ఈ అప్పుడు కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ రాజేంద్రప్రసాద్ అయితే..ఇప్పుడు అదే కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ నరేశ్ అని చెప్పుకునేంత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక శంభో శివ శంభో సినిమాతో తను ఏడుస్తూ జనాలను నవ్వించాడు. అలాగే గమ్యం సినిమా కూడా నరెశ్ కెరీర్‌లో ఓ గొప్ప సినిమాగా నిలిచింది. ఈ రెండు సినిమాలతో నరేశ్ తనలోని నటుడిని మరో కోణంలో బయటకు తీసుకు వచ్చాడు.
ఈ సినిమాల తర్వాత నరేశ్ ఆల్‌రౌండర్ అని చెప్పుకున్నారు. అలాగే మహేశ్ బాబుతో చేసిన మహర్షి సినిమా కూడా నరేశ్‌కి మంచి పేరు తీసుకువచ్చింది. దాంతో నాంది లాంటి సీరియస్ కథలను ఎంచుకోవడం మొదలు పెట్టాడు. నాంది సినిమా నరేశ్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమా. అందుకే ఈ సినిమా తర్వాత నరేశ్ మైండ్ సెట్ మారిందని టాక్ వినిపిస్తోంది. ఇకపై ఇలాంటి ఎమోషనల్ కథలను ఎక్కువగా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. చూడాలి మరి తన నుంచి రానున్న సినిమాలతో ఇంకా ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…