Movie News

దాసరి నారాయణ వల్ల అతడు రూ.100 కోట్లు నష్టపోయారు..! ఎందుకు.. ఎవరు..?

దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. అంతే కాదు మేస్త్రీగా రాజకీయాల్లోకెళ్లి ఇస్త్రీ చేసిన దర్శక నట దిగ్గజం దాసరి నారాయణ రావు. దాసరి అనేది పేరు కాదు…ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు.

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఎంతో మంది సినీ హీరోలను, హీరోయిన్లను, ఆర్టిస్టులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి.. మంచి బంగారు భవిష్యత్తును ఇచ్చిన మహోన్నత వ్యక్తి. ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా, యాక్టర్ గా , గాయకుడిగా ఎన్నో సనిమాలను తీశారు.. నటించారు. అబ్బో ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా అతడు సినిమాలకు పరిచయం చేసిన వారిలో ఓ వ్యక్తి రూ.100 కోట్లు దాసరి వల్ల నష్టపోయాడట.. ఎవరా వ్యక్తి.. ఇది నిజమేనా.. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

1995 సంవత్సరంలో ‘ఒరేయ్ రిక్షా’ సినిమా దాసరి దర్వకత్వంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దాసరి నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని.. యాక్టింగ్ లో కూడా ఎంతో ప్రతిభ ఉన్న వారిగా అందరికీ తెలిసింది. అయితే జయప్రకాశ్ రెడ్డి.. దాసరికి మంచి స్నేహితుడు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాలను చెప్పారు. అప్పట్లో జేపీ రెడ్డి సినిమాలోకి రాకముందు దాసరి నారాయణ బలవంతగా వచ్చేట్టు చేశారట.

అప్పుడు అతడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అప్పుడు అతడికి ఓ ప్రాజెక్టు వచ్చింది. దానిని చేస్తున్న సమయంలో దాసరి బలవంతం చేయడంతో ఇండస్ట్రీకి వచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టు వదిలి పెట్టి రావాల్సి వచ్చిందని.. ఆ ప్రాజెక్టు విజయవంతగా పూర్తి చేసిన వారికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఇలా దాసరి వల్ల తాను వంద కోట్ల రూపాయాలు నష్టపోయానని నవ్వుకుంటూ చెప్పారు జయప్రకాశ్ రెడ్డి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago