Actress Aindrila: చూడ చక్కని అందంతో అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది.తన కెరియర్ ఎంతో సాఫీగా హాయిగా సాగిపోతుందనుకున్న క్రమంలో పిడుగు లాంటి వార్తను వినాల్సి వచ్చింది. ఈమె క్యాన్సర్ బారిన పడ్డారని తెలియగానే మనోధైర్యంతో సరైన చికిత్స తీసుకొని క్యాన్సర్ ను జయించారు.
ఈ విధంగా ఒకసారి కాదు ఏకంగా మూడుసార్లు క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకున్నటువంటి ఈమె పట్ల విధి చిన్నచూపు చూస్తోంది. ఇలా ఎన్నోసార్లు ప్రాణాలను పణంగా పెట్టి భయంకరమైన వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె ప్రస్తుతం స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిపాలైంది. ఇలా స్ట్రోక్ వచ్చిన అనంతరం సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఈమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైంది.
ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలను జయించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాలని పోరాడుతున్న ఈమె పట్ల విధి చిన్నచూపు చూడటంతో మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె కోమాలోకి వెళ్లి పూర్తిగా వెంటిలేటర్ పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రస్తుతం ఈమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఈమె కోమాలో ఉండటమే కాకుండా తన మెదడులో అక్కడక్కడ బ్లడ్ క్లాట్ ఉండటం వల్ల తన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈమె వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా నటి ఐంద్రీలా శర్మ ఇంత చిన్న వయసులోనే ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడంతో బెంగాలీ ప్రేక్షకులు ఈమె ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…