టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ చార్మి కౌర్. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. 2001 సంవత్సరంలో నీ తోడు కావాలి సినిమాతో ఆమె తెలుగులో పరిచయం కాగా.. ఆ సినిమా అంత పెద్ద హిట్ కాకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత తమిళంలో పలు సనిమాల్లో నిటించింది ఛార్మి. తర్వాత తెలుగులో శ్రీ ఆంజనేయం, మాస్, చక్రం, లక్ష్మి, రాఖీ, పౌర్ణమి, జ్యోతి లక్ష్మి వంటి సినిమాలతో తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉండగా ఆమె డైరెక్టర్ పూరితో ఉన్న సంబంధాన్ని గురించి కొన్ని విషయాలను పంచుకుంది. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి సినిమాలో ఆమె నటించగా.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. 2013 సంవత్సరంలో మళ్లీ ఛార్మి సేవకుడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఆమె నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.
అది కూడా స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన నిర్మాణంలోనే భాగస్వామిని చేశాడు. అంతేకాకుండా తన సినిమాలకు ప్రొడక్షన్ పనులలో కూడా సహాయ పడుతుంది ఛార్మి. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినపడ్డాయి. దీనిపై తాజాగా ఛార్మి స్పందించింది. తమ మధ్య ఉన్నది ప్రొఫెషనల్ బంధమని.. కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ.. తెలిపింది.
తమ మధ్య ఈ స్నేహం గురించి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పట్టించకోనని కూడా క్లారిటీ ఇచ్చింది. మంచి స్టార్ హోదాలో తాము ఉన్నాం కాబట్టీ ఇలాంటి పుకార్లు వినిపిస్తూనే ఉంటాయని.. ఇప్పుడు ఎంత చెప్పినా వినరని ఆమె స్పష్టం చేసింది. వీటిపై వివరణ కూడా ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఆమె పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…