Featured

Actress Divya Vani : వేణు మాధవ్ తో నటించడం ఏంటి అంటే… బాపు గారు ఒకటే అన్నారు…: నటి దివ్యవాణి

Actress Divya Vani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాలో సత్యభామ గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్శించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించిన తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవల ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

వేణు మాధవ్ పక్కనా అని ఆలోచించా…

దివ్య వాణి తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక పెళ్లయ్యాక నటన కు గుడ్ బై చెప్పేసిన ఆమె మళ్ళీ చాలా రోజులకు శ్రీకాంత్ హీరోగా నటించిన ‘రాధా గోపాలం’ సినిమాలో నటించారు. అమాయకపు భార్య పాత్ర కాసులమ్మ పాత్రలో తాగుబోతు భర్త గా ఆమెకు జోడిగా వేణు మాధవ్ నటించారు. అయితే మొదట బాపు గారు ఈ పాత్ర గురించి చెప్పినపుడు వేణుమాధవ్ పక్కన నేను నటించడం ఏమిటి అనే సందేహం వచ్చిందట.

అదీ కాక అప్పటికి బాగా లావుగా ఉన్న దివ్య వాణి ఆలోచించారట. అయితే బాపు గారు ఒకటే చెప్పారట, ఈ పాత్ర నీకోసం రాసాము సౌందర్య ఆలీ, బాబు మోహన్ తో డాన్స్ చేసింది అలానే నువ్వు ఈ క్యారెక్టర్ చేయి మంచి పేరు వస్తుంది అని చెప్పారట. అలా ఆ సినిమాలో నటించానని చాలా మంది సినిమా విడుదల అయ్యాక సన్నగా ఉండి ఉంటే నువ్వే శ్రీకాంత్ పక్కన హీరోయిన్ గా బాగుండేదానివి అంటూ కామెంట్స్ చేసారని, అయితే స్నేహ కూడా చాలా బాగా నటించింది అంటూ తెలిపారు దివ్య వాణి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago