Actress Khushboo:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోలు అందరి సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించిన నటి కుష్బూ గురించి పరిచయం అవసరం లేదు.ఇలా ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలలో భాగంగా తాజాగా కుష్బూ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా కుష్బూ మొదటిసారిగా తన ప్రేమను బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ సుజాత స్కిట్ అనంతరం వీరిద్దరూ కుష్బూ ప్రేమ గురించి అడిగారు. మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం అంటూ సుజాత అడగగా ఈమె తన లవ్ స్టోరీ మొత్తం వేదికపై తెలియజేశారు. దర్శకుడు,నటుడు సుందర్ సి ఖుష్బూ భర్త అనే విషయంతెలిసిందే.
ఈయన దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన చిత్రం `మురై మామన్` చిత్ర షూటింగ్ టైమ్‌లో ఖుష్బూకి ఫిదా అయ్యారట.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన తనకు ప్రపోజ్ చేయడం అలా మా ఇద్దరి పెళ్లి జరగడం అయిపోయిందంటూ కుష్బూ తెలిపారు.అయితే తన పెళ్లి జరిగి 28 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు తన భర్తకి ఒకసారి కూడా ఐ లవ్ యు చెప్పలేదని ఈమె షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి మేడం అంటూ రాకింగ్ రాకేష్ అడగ వెంటనే ఈమె ఫోన్ చేశారు.
ఇక కుష్బూ తన మొబైల్ లో తన భర్త పేరును స్వీట్ హార్ట్ అంటూ సేవ్ చేసుకోవడం విశేషం.ఇలా తన భర్తకు ఫోన్ చేసిన ఈమె హలో అనగానే ప్రోమో కట్ చేశారు.మరి ఈమె తన భర్తకు ఎలా ప్రపోజ్ చేశారనే విషయం తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాలి.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…
రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ సంస్థ లీగల్…
ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…
బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్‌పై జైలు నుంచి…