Actress Indraja: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కొందరు కమెడియన్స్ బయటకు వెళ్లిపోవడంతో కాస్త రేటింగ్ తగ్గినప్పటికీ తిరిగి ఈ కార్యక్రమానికి హైపర్ ఆది గెటప్ శ్రీను వంటి వారు రావడంతో ఈ కార్యక్రమం పై మరికొన్ని అంచనాలు పెరిగాయి.
ఇకపోతే ఈ కార్యక్రమానికి జడ్జిగా రోజా, నాగబాబు ఉండే వారు. అయితే రోజాకు మంత్ర పదవి రావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈమె స్థానంలో ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా ఉండిపోయారు అయితే నాగబాబు స్థానంలో ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు.ఇకపోతే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా కుష్బూ ఇంద్రజ న్యాయ నిర్ణేతలుగా సందడి చేశారు.
కంటెస్టెంట్లు అందరూ ఎప్పటిలాగే తమ పెర్ఫార్మెన్స్ తో అందరిని సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా కెవ్వు కార్తీక్ వెరైటీగా జడ్జెస్ వల్ల టీం లీడర్స్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో చూపించారు.అయితే ఈ స్కిట్ అయిపోయిన అనంతరం జడ్జిమెంట్ టైంలో ఇంద్రజ మాట్లాడుతూ ఏంటి కెవ్వు కార్తిక్ ఈమధ్య మరి దారుణంగా తయారయ్యారు అంటూ ఇంద్రజ కెవ్వు కార్తీక్ కి షాక్ ఇచ్చారు.
ఇంద్రజ మాట్లాడుతూ జడ్జెస్ వల్ల టీం లీడర్స్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మీరు చూపించారు అలాగే టీం లీడర్స్ వల్ల జడ్జెస్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ స్కిట్ చేయండి అప్పుడే ఈ రెండింటికి కలిపి జడ్జిమెంట్ ఇస్తాను అంటూ ఆమె ఏకంగా కెవ్వు కార్తీక్ పై మండిపడటమే కాకుండా షో మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు.అయితే ఇది నిజంగానే జరిగిందా లేకపోతే రేటింగ్ కోసమే మరోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…