Sameer : బుల్లితెర మీద నటుడుగా ప్రయాణం మొదలు పెట్టి వెండి తెర మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు చేస్తూ వస్తున్న సమీర్ బుల్లి తెర మీద బిజీ గా ఉన్న సమయంలో ఎందుకు సినిమాల వైపు చూడాల్సి వచ్చిందో, ఎందుకు ఒక ఛానెల్ వాళ్ళు సమీర్ ను బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు వంటి విషయాలపై ఇటీవల ఇంటర్వ్యూలలో స్పందించారు సమీర్. ఈటీవీ లో పలు సీరియల్స్ లో నటించిన సమీర్ దాదాపు నెల మొత్తం ఈటీవీ సీరియల్స్ తోనే బిజీగా ఉండేవాడట. ‘శాంతి నివాసం’ వంటి సీరియల్స్ లో మంచి బ్యానర్స్ లో నటించాడు సమీర్.
అమ్మాయితో ఎఫైర్… బ్లాక్ లిస్ట్ లో పేరు…
ఈటీవీ లో సీరియల్స్ వరుసగా చేస్తున్న సమయంలో ఒక కో ఆర్టిస్ట్ తో చనువుగా ఉండి ఆ అమ్మాయి తో ఎఫైర్ నడుపుతున్నాడని ఈటీవీ వారు ఆయనను బ్యాన్ చేసారు. ఈటీవీ లో వచ్చే ఏ ప్రోగ్రామ్స్ లోనూ ఆయన నటించకుండా బ్యాన్ విధించి బ్లాక్ లిస్ట్ లో నేమ్ పెట్టారు. ఇక ఈవిషయం గురించి మాట్లాడుతూ సమీర్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎవరో చెప్పిన మాటలు విని సుమన్ గారు నన్ను బ్యాన్ చేసారు. ఒక్కసారి పిలిచి నీ గురించి ఇలాంటి ఫిర్యాదు వస్తోంది అని నన్ను అడుగుంటే బాగుండేది, ఆయన ఏ మాత్రం నన్ను వివరణ అడగకుండా సడెన్ గా నేను చేస్తున్న సీరియల్ ఆపేసారు. ఇక నన్ను బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు, నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది.
మొత్తం ఈటీవీలోనే సీరియల్స్ చేస్తున్న సమయంలో ఇలా జరగడంతో కట్టాల్సిన లోన్లు అన్నీ అలానే ఉండిపోయాయి. నెలకు వచ్చే ఆదాయం పోయింది ఏం చేయాలో తెలియలేదు. ఇక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు అందుకే సన్నిహితుడైన ప్రభాకర్ కి కూడా ఏమి చెప్పలేదు, అతని సహాయం తీసుకోలేదు. ఇక మళ్ళీ కొన్నేళ్లకు సుమన్ గారే మాట్లాడారు అప్పుడు నీపై తప్పుడు మాటలను విన్నాను అంటూ చెప్పారు. ఇక ఆ సంఘటన వల్ల నేను సినిమాల్లోకి వచ్చాను ఆ ఖాళీగా ఉన్న సమయంలో సినిమాలలో ప్రయత్నించాను అంటూ చెప్పారు సమీర్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…