Movie News

Actress Khushboo: జబర్దస్త్ వేదికపై లవ్ స్టోరీ బయటపెట్టిన సీనియర్ నటి.. ఫోన్లోనే భర్తకు ప్రపోజ్!

Actress Khushboo:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోలు అందరి సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించిన నటి కుష్బూ గురించి పరిచయం అవసరం లేదు.ఇలా ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలలో భాగంగా తాజాగా కుష్బూ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా కుష్బూ మొదటిసారిగా తన ప్రేమను బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ సుజాత స్కిట్ అనంతరం వీరిద్దరూ కుష్బూ ప్రేమ గురించి అడిగారు. మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం అంటూ సుజాత అడగగా ఈమె తన లవ్ స్టోరీ మొత్తం వేదికపై తెలియజేశారు. దర్శకుడు,నటుడు సుందర్‌ సి ఖుష్బూ భర్త అనే విషయంతెలిసిందే.

ఈయన దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా రూపొందించిన చిత్రం `మురై మామన్‌` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో ఖుష్బూకి ఫిదా అయ్యారట.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయన తనకు ప్రపోజ్ చేయడం అలా మా ఇద్దరి పెళ్లి జరగడం అయిపోయిందంటూ కుష్బూ తెలిపారు.అయితే తన పెళ్లి జరిగి 28 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు తన భర్తకి ఒకసారి కూడా ఐ లవ్ యు చెప్పలేదని ఈమె షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి మేడం అంటూ రాకింగ్ రాకేష్ అడగ వెంటనే ఈమె ఫోన్ చేశారు.

Actress Khushboo: స్వీట్ హార్ట్ అంటూ సేవ్ చేసుకున్న కుష్బూ…

ఇక కుష్బూ తన మొబైల్ లో తన భర్త పేరును స్వీట్ హార్ట్ అంటూ సేవ్ చేసుకోవడం విశేషం.ఇలా తన భర్తకు ఫోన్ చేసిన ఈమె హలో అనగానే ప్రోమో కట్ చేశారు.మరి ఈమె తన భర్తకు ఎలా ప్రపోజ్ చేశారనే విషయం తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాలి.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago