Actress Khushbu: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అందం, అభిప్రాయంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న కుష్బూకి ప్రేక్షకులు గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక ప్రస్తుతం కుష్బూ ఒకవైపు సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా రాజకీయాలలో కూడా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందిన రామాబాణం సినిమాలో గోపీచంద్ కి తల్లిగా నటించింది.లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం రామబాణం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఖుష్బు గోపీచంద్ తల్లిగా నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ సినిమా గురించి, సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూ ఖుష్బూ మాట్లాడుతూ…” ఈ సినిమాలో కుటుంబ బంధాల గురించి చక్కగా వివరించారు. ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా.. కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యమని తెలిపే కథ ఇది అని తెలిపింది. ఇక ఈ సినిమాలో నా పాత్ర ఎంతో అద్భుతంగా ఉంది.మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, విలువలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలిపింది.
ఈ సినిమాలో నా పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది.గతంలో అజ్ఞాతవాసిలో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు ఆదరించలేదు,ఈ సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం కుష్బూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…