Actress Mahreen: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాని సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా ఎఫ్ త్రీ సినిమాతో మంచి హిట్ కొట్టిన మెహరీన్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తెలుగుతో పాటు పలు భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గతంలో ఓ పొలిటీషియన్ కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈమె నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.అయితే పెళ్లికి కొంత సమయం ఉందన్న నేపథ్యంలో తన నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.
ఈ విధంగా ఈమె పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఇలా ఉన్నఫలంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుని కూడా కొంతకాలం అవుతున్నప్పటికీ తాజాగా ఈమె పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ కావడానికి ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కారణమని తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెహరీన్ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక కెరియర్లో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తనకు తన సినిమాలలో నటించే అవకాశం కల్పించారని, ఇలా ఆ సమయంలో మెహరీన్ ఆ డైరెక్టర్ మధ్య ఎంతో సఖ్యత ఏర్పడిందనీ, ఈ కారణం వల్లే మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈమె పెళ్లి క్యాన్సిల్ కావడం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…