పూరిజగన్నాథ్ దర్శకత్వంలో హీరో పోతినేని రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని ప్రతీ సాంగ్ యూట్యూబ్ లో రచ్చ రేపాయి. కొన్ని వందల మిలియన్ వ్యూస్ దాటేశాయి. సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు.
ఈ సినిమాలో అమ్మడి అందానికి.. నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. యంగ్ హీరోలకు ఫస్ట్ చాయిస్‌గా మారిన హీరోయిన్ నభా నటేష్.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. టాలివుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ భామ బాలీవుడ్ లో అడుగుపెట్టనుందనే టాక్ వినిపిస్తోంది.
అదికూడా ఓ స్టార్ హీరోసరసన నటించనుందని తెలుస్తోంది. హీరో హృతిక్ రోషన్ సరసన నభా నటేష్ నటించనుందనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఆమె అతడితో చేసేది సినిమా కోసం కాదని.. హిందీలో ఓ వెబ్ సిరీస్ లో ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారంట. జాన్ లే కర్రె రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిన సూపర్ హిట్ బ్రిటిష్ గూఢచారి థ్రిల్లర్ ది నైట్ మేనేజర్ అనే సిరీస్‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.
ఈ సిరీస్ తో హృతిక్ రోషన్ తొలిసారిగా డిజిటల్ వైపు అడుగుపెట్టనున్నారు. ప్రస్తతం ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు హృతిక్ రోషన్. ఈ సినిమాలో దీపికా పదుకునే అతడి సరసన నటిస్తుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తారా.. లేదా.. రెండు ఒకే టైంలోనే షూటింగ్ జరుపుతారా అనేది స్పష్టంగా తెలియదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…