Actress Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇలా ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె నిశ్చితార్థం జరిగిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వెల్లడించారు.
ఈ విధంగా పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో నిశ్చితార్థం జరుపుకున్నానని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు.అయితే త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోందని సంతోషించిన కొన్ని రోజులకే ఈమె పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి.
నటి పూర్ణకు ఒక డైరెక్టర్ తో సంబంధం ఉందని అందుకే తన పెళ్లి క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి.ఇలా తన పెళ్లి గురించి ఇలాంటి వార్తలు షికార్లు చేయడంతో పూర్ణ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్తతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫరెవర్ మైన్ అని క్యాప్షన్ పెట్టారు. ఇలా పూర్ణ ఈ ఫోటో ద్వారా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా తనకు కాబోయే భర్త పై తనకున్న ప్రేమను కూడా చాటుకున్నారు. మొత్తానికి ఒక్క పోస్టుతో పూర్ణ తన గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టారు.
ఇంటి లోపల చిన్నారి ఉంటే డైపర్లు వాడటం ఇప్పుడు సాధారణంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగస్త తల్లిదండ్రులకు ఇది ఎంతో సౌకర్యం…
ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…
ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…
కాలేయం (లివర్) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…
దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…