Shekhar Master : ఎస్ఎమ్ఎస్ సినిమాతో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చికుని జులయి, బాద్ శా వంటి టాప్ హీరో సినిమాలకు కోరియోగ్రఫీ చేసే అవకాశాన్ని అందుకున్న శేఖర్ మాస్టర్ మొదట గ్రూప్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలై నేడు టాప్ డాన్స మాస్టర్స్ లో ఒకడిగా ఉన్నాడు. కష్టపడి పైకి వచ్చిన మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో డాన్స్ మాస్టర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక తనతో డాన్స్ నేర్చుకున్న సెలబ్రిటీల గురించి తనకు అవకాశాలు ఇచ్చిన హీరోల గురించి శేఖర్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. రాకేష్ మాస్టర్ శిష్యుడిగా కొనసాగి ఆ తరువాత సొంత డాన్స్ స్కూల్ పెట్టుకుని అలా నేడు డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు శేఖర్ మాస్టర్.
అనుష్క, రామ్, ప్రభాస్ లకు డాన్స్ నేర్పాను…
వైవిఎస్ చౌదరి సినిమా దేవదాస్ కు కొత్త హీరో ని తీసుకున్నారు అతనే రామ్ పోతినేని. ఇక రాకేష్ మాస్టర్ మొత్తం డాన్స్ కంపోజ్ చేసారు ఆ సినిమాకు. అయితే రామ్ కొత్త కుర్రాడు అని డాన్స్ క్లాస్ కు వచ్చినపుడు నేనే తనకు డాన్స్ నేర్పాను. ఇక అనుష్క ఇండస్ట్రీకి వచ్చాక నాతోనే డాన్స్ నేర్చుకుంది. ఇక ప్రభాస్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చినపుడు ఆయనకు డాన్స్ నేర్పడానికి రాకేష్ మాస్టర్ ని కలిశారు.
అయితే రాకేష్ మాస్టర్ ఒక్కోసారి నన్ను ప్రభాస్ కు డాన్స్ నేర్పడానికి పంపేవారు. అలా ఆయనతో పరిచయం ఏర్పడింది. ఇక ఢీ ఒక సీజన్ కి గెస్ట్ గా వచ్చినపుడు ప్రభాస్ గారు నన్ను ఒకసారి మీతో కలిసి వర్క్ చేయాలి మాస్టర్ అని చెప్పారు. అలా మిర్చి షూటింగ్ అప్పుడు కొరటాల శివ గారిని ప్రభాస్ గారు పరిచయం చేసి నా గురించి చెప్పారు. కానీ ఎందుకో మా ఇద్దరికి సినిమా సెట్ అవ్వలేదు అంటూ శేఖర్ మాస్టర్ ప్రభాస్ తో ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఇక మంత్ర, మంగళ సినిమాల్లో కోరియోగ్రఫీ కి మంచి పేరు వచ్చిందని చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…