Movie News

Bigg Boss6: తక్కువ మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ 6.. వివాదాలకు చోటు లేకుండా జాగ్రత్తలు?

Bigg Boss6: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని చెప్పాలి. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని వార్తలు వినపడుతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడుతుంది. ఇకపోతే ఈసారి సీజన్ లో బిగ్ బాస్ నిర్వాహకులు తక్కువ మంది కంటెస్టెంట్లతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కేవలం 12 లేదా 13 మంది కంటెస్టెంట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇకపోతే గత కొన్ని సీజన్ల నుంచి ఈ కార్యక్రమం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ కార్యక్రమాల ద్వారా జీవితంలో ఒకటి కావాల్సిన వాళ్ళు కూడా విడిపోతున్నారని, ఈ కార్యక్రమం చూసి చిన్న పిల్లలు కూడా తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి విమర్శలకు తావు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.

Bigg Boss6: హోస్ట్ గా నాగార్జున…

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇకపోతే రెండవ సీజన్ మాదిరిగా ఈ సీజన్లో కూడా కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతోంది.ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొందరు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనబోతున్నారనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago