సాధారణంగా చాలామందికి టెర్రస్ మీద అంటే మేడ మీద ప్రేమ కథలు జరిగే ఉంటాయి. చిన్నతనం నుంచి ఏదో ఒక సందర్భంలో ఇలా టెర్రస్ పైకి ఎక్కి ప్రేమ వ్యవహారాలను నడిపే ఉంటారు. మేడ మీదకు చదువుకోవడానికి వెళ్లినప్పుడో.. లేదా బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడో ప్రేమ కథలు నడిచే ఉంటాయి.
ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీలు అంటారు. ఇలాంటి స్టోరీలు వారి వారి జీవితంలో జరిగే విషయాలను తమ కళ్ల ముందుకు తీసుకొచ్చేందుకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ప్రయత్నిస్తున్నాడు. దాని కోసం తన యూ ట్యూబ్ ఛానల్ లో స్వీయ నిర్మాణంలో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్, బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ మధ్య ఢీ డాన్స్ షో, ఇప్పుడు కామెడీ స్టార్స్‌కి జడ్జీగా ఉన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇలా టెర్రస్ ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగంగా.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్ షోలకు సంబందించిన ప్రముఖ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైపర్ ఆది, ప్రియమణి, అనసూయ తమ టెర్రస్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుని ప్రమోషన్ చేశారు. తాజాగా నటి పూర్ణ తన టెర్రస్ అనుభవాలను పంచుకున్నారు.
ఆమె లవ్ స్టోరీ కాకుండా టెర్రస్ పై జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చారు. తన ఇంటి చుట్టు పక్కల ఉండే వాళ్లు అంతా తనకు బ్రదర్స్ అని.. అందుకే ఎలాంటి లవ్ స్టోరీలు లేవని చెప్పారు. చిన్నతనంలో ఓ రోజు టెర్రస్ మీద నుంచి కిందపడగా.. తలకు పెద్ద గాయం అయిందని.. మూడు నెలల ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. టెర్రస్ లవ్ స్టోరీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నామని.. శేఖర్ మాస్టార్ కు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు పూర్ణ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…