నాగ చైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. సినిమాల్లోని ప్రతీ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి నాలుగు పాటల విడుదల కాగా.. ఎంతో మంది ఆ పాటలకు మంత్రముగ్ధులు అయ్యారు.
అయితే ఇక్కడ జరిగిన ఓ ఘటనలో.. పోలాండ్ దేశానికి చెందిన జిబిగ్జ్( బుజ్జి) అనే కుర్రాడు తెలుగు పాటలు పాడతూ, డైలాగ్స్‌లను చెబుతూ.. పాపులర్‌గా మారాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్‌లు, పాటలు పాడిన ఈ 12 ఏళ్ల కుర్రాడు.. సోషల్ మీడియాలో ఓ చిన్న సైజ్ సెలబ్రెటీగా మారాడు. లవ్ స్టోరీకి సంబంధించి సినిమాలో ‘నీ చిత్రం చూసి’ అనే సాంగ్ యూట్యూబ్ లో ఓ సంచలనం స్పష్టించింది. కొన్ని మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.
అయితే ఈ కుర్రాడి నోటి వెంట నుంచి కూడా ఈ పాట వచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. ఆ వీడియో కింద అతడు హాయ్.. నాగచైతన్య, హాయ్ సాయి పల్లవి.. లవ్ స్టోరీ సినమాలో తాను ‘నీ చిత్రం చూసి’ పాట పాడాను అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్టు చేశాడు. అతడు పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి అయినా తెలుగును స్పష్టంగా పలకడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు.
అతడిని నెటిజన్లు ప్రశంసలతో హోరెత్తించారు. అయితే అతడతికి తెలుగు ఇలా స్పష్టంగా రావడానికి గల కారణం ఉంది. ఈయన తండ్రి దాదాపు పాతికేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి పోలాండ్ వెళ్లాడు. అక్కడే యూలా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కలిగిన సంతానమే ఈ జిబిగ్జ్. తన తండ్రి పోత్సాహంతో అతడు కర్ణాటక సంగీతంలో తెలుగు భాషను నేర్చుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…