బిగ్ బాస్ 2 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేడు ఎలిమినేషన్ ఉండటంతో అభిమానులు, కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర ఉత్కంఠత నెలకొంది. బిగ్ బాస్ మొదటి వారంలో హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ కాగా రెండవ వారం నామినేషన్ లిస్ట్ లో ప్రియా, ప్రియాంక, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, కాజల్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఎలిమినేట్ అవుతారా అంటూ చాలామంది ఆతృతగా ఎదురు చూశారు.
ఇక శనివారం హౌస్ సభ్యులతో మాట్లాడిన నాగార్జున హౌ సభ్యులందరికీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లో కంటెస్టెంట్ ల మాటలు కొంతవరకు పరిధి దాటి మాట్లాడుతున్న నేపథ్యంలో నాగార్జున వీరందరికీ వార్నింగ్ ఇచ్చి మరోవైపు ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల కోసం ప్రాణాలు పెడుతున్నారని ఎంతో చక్కగా ఆడుతున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇక రెండవ వారం పూర్తి కావస్తున్న నేపథ్యంలో నేడు ఎలిమినేషన్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ ఎలిమినేషన్ లో భాగంగా లోబో, అనీ మాస్టర్, ప్రియాంక సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డేంజర్ జోన్లో ప్రియా, కాజల్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ ఉన్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నేడు హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ లేదా ఉమా దేవి ఎలిమినేట్ అవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఈ వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతారా..? లేక ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. హౌస్ లో కంటెస్టెంట్ లపై బూతులు మాట్లాడిన ఉమాదేవిని బిగ్ బాస్ ఇంటి నుంచి పంపేయ దలచుకున్నాదంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈరోజు హౌస్ నుంచి ఉమా దేవి లేదా నటరాజ్ మాస్టర్ వీరిద్దరిలో ఎవరు బయటకు వస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…