బిగ్ బాస్ సీజన్ 5 రెండవ వారం ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ముగిసింది. రెండవ వారంలో కంటెస్టెంట్ ల మధ్య పోటాపోటీలు, ఒకరితో ఒకరికి వాగ్వాదం, ఘర్షణలు, పోట్లాటలతో ప్రేక్షకులను ఎంతో ఎంటర్ టైన్ చేస్తూ.. రెండవ వారం ముగిసింది. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ప్రియా, ప్రియాంక, లోబో, కాజల్, ఉమాదేవి, అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ ఉండగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం గురించి ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
ఎలిమినేషన్ లిస్టులో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో లోబో, అనీ మాస్టర్, ప్రియాంక, సేఫ్ జోన్ లో ఉండగా డేంజర్ జోన్ లో ప్రియా, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి, కాజల్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నలుగురిలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఉమాదేవి ఎలిమినేట్ కానుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్ లపై బూతుల పురాణం అల్లిన ఉమాదేవిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎలాగైనా ఎక్కువ రోజులు కొనసాగాలన్న ఉద్దేశంతో ఉమాదేవి లోబోతో ప్రేమ ప్రయాణం చేసింది. ఈ క్రమంలోనే లోబో కూడా తనతో ఎంతో సాన్నిహిత్యంగా వ్యవహరించారు.
ఇక శనివారం కార్యక్రమంలో భాగంగా నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ వీరందరికీ వార్నింగ్ ఇచ్చినట్లు మనకు తెలిసిందే. అలాగే బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో వీరందరూ ఎంతో చక్కగా తమ ప్రతిభను కనబరుస్తున్నారనడంతో బిగ్ బాస్ వీరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంపై నాగార్జున ఉమాదేవిని ఉద్దేశిస్తూ ఉమాదేవి సేఫ్ అవుతుందా అనీ లోబోని అడగగా అందుకు లోబో.. నా పొట్టి నాకు కావాలి సార్ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమాదేవి విషయంలో లోబో ప్రేమ ఫలించలేదనీ చెప్పవచ్చు. ఇక రెండవ వారంలో ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వస్తుందని సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…