విటమిన్ ఏ అనేది కళ్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే కొన్ని మొక్కల్లో ఇలాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకులు పొలాల గట్ల మీద వెళ్తున్న సమయంలో ఎన్నో ఆకు కూర మొక్కలు కనిపిస్తుంటాయి. ఆ ఆకుకూరలు మన పెద్దలు తినడం వల్లనే ఎంతో కాలం ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్నారు.
అందుకనే 60 ఏళ్ళు దాటినా వాళ్ల పళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుత జీవన విధానంలో ఏ మాత్రం పోషకాలు లేని ఆహారాలను తింటున్నారు. దీంతో 60 ఏళ్లల్లో ఊడిపోవాల్సిన పళ్లు ఆరు సంవత్సరాలకే ఊడిపోతున్నాయి. పల్లెల్లో కనిపించే గంగవాయిల కూర ఎంతగానో ఉపయోగపుడుతంది. ఇక్కడ వాటి గురించి తెలుసుకుందాం.. గంగవాయిల(గంగవెల్లి) ఆకు కూర అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
కావునా ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. గంగవాయిల కూర అనేది చిన్న సైజులో మరియు పెద్ద సైజులో కూడా ఉంటాయి. ఏ కూరను తిన్నా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి .. మన శరీరంలోని కొల్లాజెన్ , రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, అలాగే గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది. బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుందని.. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తాయని అనేక పరిశోధనలో వెల్లడైంది.
దీని ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందని తెలిపారు. గుండెకు సంబంధించిన ఎటువంటి వ్యాధులు రాకుండా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలు బలంగా ఉండటానికి ఈ గంగవాయిల కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. దీంతో ఎముకలు ధృఢంగా తయారు అవుతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…