Health News

అన్నం వండే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

మన భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బియ్యాన్ని వండుకొని తింటుంటారు. అయితే అన్నం వండే సమయంలో చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణ భారత దేశంలో అందరూ అన్నం తింటున్నవాళ్లే. ఇంగ్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం..

కీటకాల నుంచి వరిని కాపాడటం కోసం, అధిక దిగుబడుల కోసం రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తున్నారు. ఇది వరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఎఫెక్ట్ వరితో తయారయ్యే బియ్యంపై కూడా పడుతుందని ఆ అధ్యయనం చెబుతోంది. అయితే ఆ బియ్యం కడిగే సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కడుగుతారు. దీని వల్ల ప్రమాదం ఉంటుందని.. అంతే కాకుండా అన్నాన్ని కూడా పూర్తిగా ఉడికించాలని ఆ అధ్యయనం చెబుతోంది.

అన్నం సరిగ్గా ఉడకబెట్టకపోతే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ బియ్యంతో వండుతున్న అన్నం తినడం కారణంగా ఎంతో కొంత రసాయనాలు మన శరీరంలోకి వెళుతున్నాయని తేల్చారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు. అయితే దీనికి ఉత్తమమైన మార్గం ఏంటంటే అన్నం వండటానికి ముందు రాత్రిపూట బియ్యాన్ని నీటిలో నానబెట్టడం మంచిది.

దీని కారణంగా బియ్యంలో ఉండే టాక్సిన్స్ 80 శాతం తగ్గుతాయని చెబుతున్నారు. దక్షిణాదిలో అన్నంతో చేసే పులిహోర, పలావు, కొత్తిమీర అన్నం, కొబ్బరి అన్నం, పుదీన అన్నం, టమాటో అన్నం, వంకాయ రైస్, పొంగలి లాంటి పదార్ధాలు కనీసం 30కి పైగానే ఉంటాయి. ఇక పిండి వంటలలో రకాలలో అయితే లెక్కకు మించి ఉంటాయి. ఇలా ఎన్నో రకాల వంటకాలల్లో కూడా బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దోశలు చేయడానికి కూడా బియ్యాన్నే ఉపయోగిస్తుంటారు కనుక ఈ బియ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago