అలనాటి హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన ఈమె నటనలోనే కాకుండా కథకురాలిగా.. నిర్మాతగా అనుభవం ఉంది. సుహాసిని మొదట 1980 లో ‘నెంజతై కిల్లతే ’ అనే తమిళ చిత్రంలో నటించారు. తర్వాత ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్న విషయం తెలిసిందే.
అయితే సుహాసిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆమె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘మంచిదొంగ’, ‘ఆఖరి పోరాటం’ చిత్రాల్లో నటించారు. మంచిదొంగ సినిమాలో చిరంజీవి సరసన.. ఆఖరిపోరాటం సినిమాలో నాగార్జున సరసన నటించిన విషయం తెలిసిందే.
మంచిదొంగ సినిమాలో సుహాసిని లాయర్ పాత్ర వేయగా.. మరో హీరోయిన్ గా విజయశాంతి ఇన్ స్పెక్టర్ రోల్ చేశారు. ఆఖరిపోరాటంలో మెయిన్ రోల్ గా శ్రీదేవి నటించగా.. సుహాసిని ఆ సినిమాలో చేయమని మొదట చెప్పింది చిరంజీవి అట. నువ్వు ఆఖరిపోరాటం కథను తప్పనిసరిగా వినాలంటూ చెప్పాడట మెగస్టార్. ఈ రెండు సినిమాల్లో మొదట షూటింగ్ మొదలైంది ఆఖరిపోరాటం కాగా.. మొదట థియేటర్లలో విడుదలైంది మాత్రం మంచిదొంగ.
ఆఖరి పోరాటంలో సుహాసిని పాత్రకు మొదట రేవతి అనుకున్నారట. కానీ రైటర్ జంధ్యాల ఆ పాత్రకు సుహాసిని అయితే సరిపోతుందని చెప్పారట. అయితే రాఘవేంద్రరావును సుహాసిని కలిసినప్పుడు నువ్వు ఈ పాత్ర చేయకపోతే రేవతి చేసే విధంగా ఒప్పించు లేదంటే.. నువ్వే చేయాలి అంటూ ఆ దర్శకుడు అన్నాడట. అలా చిరంజీవి రికమండ్ చేయడం.. రాఘవేంద్రరావు స్వయంగా అడగడంతో ఆఖరిపోరాటంలో సుహాసిని నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…