ఎముకల వ్యాధి నివారణకు.. ఈ కూర తింటే ఎన్నో ప్రయోజనాలో..

0
503

విటమిన్ ఏ అనేది కళ్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే కొన్ని మొక్కల్లో ఇలాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మన పూర్వీకులు పొలాల గట్ల మీద వెళ్తున్న సమయంలో ఎన్నో ఆకు కూర మొక్కలు కనిపిస్తుంటాయి. ఆ ఆకుకూరలు మన పెద్దలు తినడం వల్లనే ఎంతో కాలం ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్నారు.

అందుకనే 60 ఏళ్ళు దాటినా వాళ్ల పళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ప్రస్తుత జీవన విధానంలో ఏ మాత్రం పోషకాలు లేని ఆహారాలను తింటున్నారు. దీంతో 60 ఏళ్లల్లో ఊడిపోవాల్సిన పళ్లు ఆరు సంవత్సరాలకే ఊడిపోతున్నాయి. పల్లెల్లో కనిపించే గంగవాయిల కూర ఎంతగానో ఉపయోగపుడుతంది. ఇక్కడ వాటి గురించి తెలుసుకుందాం.. గంగవాయిల(గంగవెల్లి) ఆకు కూర అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.

కావునా ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. గంగవాయిల కూర అనేది చిన్న సైజులో మరియు పెద్ద సైజులో కూడా ఉంటాయి. ఏ కూరను తిన్నా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి .. మన శరీరంలోని కొల్లాజెన్ , రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, అలాగే గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది. బీటా కెరోటిన్‌ అనేది ఎక్కువగా ఉంటుందని.. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తాయని అనేక పరిశోధనలో వెల్లడైంది.

దీని ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందని తెలిపారు. గుండెకు సంబంధించిన ఎటువంటి వ్యాధులు రాకుండా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకలు బలంగా ఉండటానికి ఈ గంగవాయిల కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. కాల్షియం, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. దీంతో ఎముకలు ధృఢంగా తయారు అవుతాయి.