Actress Pragathi: ఎన్నో తెలుగు సినిమాలలో తల్లిగా, అత్తగా, పిన్ని పాత్రలలో నటిస్తూ ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు నటి ప్రగతి. సినీ కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె అనంతరం హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ప్రగతి మరోవైపు సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈమె వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలను మాత్రమే కాకుండా డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఒకవైపు సోషల్ మీడియాలోనూ, మరోవైపు వెండితెరపై, అలాగే బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రగతి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రగతి తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈమె తన భర్త నుంచి ఎందుకు విడిపోయారు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను తెలియచేశారు.
తన తల్లి సింగిల్ పేరెంట్ గా తనని పెంచి పెద్ద చేశారు అయితే తన తల్లిలా తన జీవితం ఉండకూడదని ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తతో చాలా విషయాలలో సర్దుకుపోతూ వచ్చారు. పిల్లల కోసం తాను ఎలాంటి కష్టానైయినా భరించాలని ఈమె ప్రతి విషయంలోన రాజీ పడ్డారు. అయితే జీవితాంతం ఇలాగే సర్దుకుపోవాల్సి వస్తుందని, రాజీ పడాల్సి వస్తుందని భావించిన ఈమె తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చానని ఈమె తెలిపారు. ఇలా తన భర్తతో తనకు ఏమాత్రం సెట్ కాకపోవడం వల్లే విడాకులు ఇచ్చానని, ఒంటరిగా ఎంతో కష్టపడి తన పిల్లలను పెంచి పెద్ద చేశానంటూ ఈ సందర్భంగా ఈమె విడాకుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…