Actress Pragathi: సినిమా ఇండస్ట్రీలో నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రగతి ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ముఖ్యంగా ఈమె ఈ వయసులో కూడా గంటల తరబడి జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కూడా తీసుకుంటూ ఉంటారు.ఇలా నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేసే ప్రగతి కొన్నిసార్లు తన మాస్ వీడియోలను కూడా ప్రేక్షకుల కోసం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.
ఇకపోతే తాజాగా ఈమె తీన్మార్ స్టెప్పులతో దద్దరిల్లిపోయే మాస్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సోదరి వివాహం కావడంతో ఈమె డప్పుల శబ్దానికి తీన్మార్ స్టెప్పులు వేస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా చెల్లి పెళ్లి.. అందుకే సైలెంట్ గా ఉండలేకపోయాను పిచ్చినీ ప్రవహించనివ్వండి అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.
సాధారణంగా పెళ్లి అంటేనే మంగళ వాయిద్యాలు డోలు శబ్దాలు పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొని ఉంటుంది.ఇలా పెళ్లిలో సాధారణ వ్యక్తులకే పూనకం వచ్చినట్టు ఊగిపోతూ డాన్సులు వేస్తుంటారు. మరి హైపర్ ఆక్టివ్ గా ఉన్నటువంటి ప్రగతి ఆంటీ శబ్దాలకు ఓ రేంజ్ లో ఊగిపోయి మాస్ పెర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ప్రగతి ఆంటీ సూపరో సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…