Actress Radha: బుల్లితెరపై ప్రతి ఒక్క చానల్లోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ ఉంటాయి. అయితే స్టార్ మాలో ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అయితేఈ బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్నటువంటి కొందరు కంటెస్టెంట్లను బిగ్ బాస్ జోడిగా నియమించి ఒక డాన్స్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి సీనియర్ నటి రాధా అలాగే కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ నటి సదా కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆదివారం బిగ్ బాస్ జోడిలను ఆహ్వానించి ఎంతో సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ కార్యక్రమం శని ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది ఇక మొదటి ఎపిసోడ్ లో భాగంగా కొందరి జోడీలు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే చివరిలో అవినాష్ అరియాన పర్ఫామెన్స్ అయిన తర్వాత అవినాష్ దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ తో రాదను పలకరించారు. ఇలా కృష్ణ గొంతుతో తనని పలకరించడంతో రాధా కృష్ణను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.
నటి రాధా కృష్ణ సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అలాంటి గొప్ప నటుడు చనిపోయారన్న వార్త తలచుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రాదా కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలందరి సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…