Actress Radhika: కర్ణాటక మాజీ సీఎం, నిర్మాత కుమారస్వామి గౌడ భార్య నటి రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు సినిమాలలో నటిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే తెలుగులో ఈమె అవతారం, భద్రాద్రి రాముడు వంటి సినిమాలో కూడా హీరోయిన్ పాత్రలు నటించినప్పటికీ ఈ సినిమాలో హిట్ కాకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమై కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె నిర్మాత కుమారస్వామి ప్రేమలో పడి అనంతరం తనని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ విధంగా రాధిక తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే రాధిక తన ట్రైనర్ తో కలిసి మాస్ స్టెప్పులకు అదిరిపోయే పర్ఫామెన్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఈమె ఎనర్జీ లెవెల్స్ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే
ఈ విధంగా తన ట్రైలర్ తో పోటీగా డాన్స్ చేస్తున్న రాధిక ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోయారు. అయితే ఈమె అప్పటికే డాన్స్ చేస్తూ తన ఒంట్లో ఓపిక శక్తి కోల్పోవడంతోనే కింద పడిపోయిందని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే కుమారస్వామి కంటే ముందుగానే తాను రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆయన మరణించడంతో కుమారస్వామిని రెండవ వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…
మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…