Movie News

ఆనందం హీరోయిన్ రేఖ పై వచ్చిన రూమర్లలో వాస్తవం ఏంటో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే సెలబ్రిటీల పై రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో వాస్తవం ఉన్నా లేకున్నా వారి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో రావడం సర్వసాధారణమే ఈ విధంగా ఆనందం సినిమాలో నటించినటువంటి హీరోయిన్ రేఖ పై అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందనే ఈ విషయంపై నటి రేఖ స్పందిస్తూ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నిజానికి ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో ఆనందం సినిమాతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో కొన్ని ఫ్లాపులు రాగానే బుర్ర తక్కువ ఆలోచనలు చేసి తెలుగు సినిమా పరిశ్రమని వదిలి కన్నడ పరిశ్రమ వైపు వెళ్లానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. తెలుగులో ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని కాదని కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు అని ఈ సందర్భంగా రేఖ తెలియజేశారు.

తెలుగు సినిమా చేస్తున్న సమయంలో తన గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. తను ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాననే వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున రావడంతో నటి తన గురించి వస్తున్న మరణ దోషం తొలగిపోవాలంటే పేరు మార్చు కోవాలని భావించింది. అందుకే రేఖ వేదవ్యాస్ అయిన తన పేరును ఆనందం సినిమాలో నటించడం వల్ల ఆనందం రేఖగా మారిపోయింది.

ఒకానొక సమయంలో మణిరత్నం లాంటి అగ్ర దర్శకుల సినిమా అవకాశాలు వచ్చినా కాదనడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ సినిమా అవకాశాలను మిస్ చేసుకున్నందుకు ఎంతో బాధపడుతున్నారు.ప్రస్తుతం కన్నడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తున్న ఈమె తెలుగు సినిమా అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రస్తుతం తన శరీర బరువు అధికంగా ఉండటం వల్ల తన దృష్టిని మొత్తంశరీర బరువును తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని అయితే తనకు తెలుగులో ఎలాంటి అవకాశాలు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తన గురించి వచ్చిన రూమర్లపై,తన మనసులో ఉన్న మాటను కూడా ఈ సందర్భంగా బయట పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఇల్లు కొనేముందు దిశ చూడాలి అంటారు ఎందుకు? తూర్పు వైపు ఉన్న ప్రయోజనాలు

తూర్పు ముఖ ఇల్లు ఎందుకు ప్రత్యేకం? వాస్తు, ప్రకృతి చెప్పే విశేషాలు కొత్త ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా, అద్దెకు వెళ్లాలనుకున్నా…

8 minutes ago

15 నిమిషాల ఆ పనికి 30 కోట్లు వెచ్చించిన టర్కీ మహిళా..!సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన స్టోరీ..

సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని, వారితో మాట్లాడాలని అభిమానుల్లో ఉండే ఆసక్తి కొత్తది కాదు. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి ఎవరు…

17 minutes ago

అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత: నాలుగో అంతస్తులో అగ్ని, విద్యార్థుల ఆందోళన…

మైత్రీవనం లోని నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు…

20 minutes ago

“ముఖంపై మొటిమలతో ఇబ్బందా? ఈ చిన్న మార్పులు చేస్తే చర్మం మెరిసిపోతుంది!”

నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ముఖంపై మొటిమలు ఒకటి. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా…

31 minutes ago

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో మోడీ స్ట్రాటజీ..శామ్ ఆల్ట్‌మన్ ఎందుకు అయోమయం చెందారు?

భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. విదేశీ…

36 minutes ago

“నా అన్వేషణకు భారీ షాక్: ఇన్‌స్టా బ్యాన్‌పై అన్వేష్ కౌంటర్ రియాక్షన్ వైరల్!”

తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…

44 minutes ago