టాలీవుడ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి.. ఆ సినిమాలో తన అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది.
తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది.యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది.ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.
తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. అయితే గత మూడేళ్ళలో సాయి పల్లవి నాలుగు సినిమాలని వదులుకుందట. వాటిలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఒకటి. ముందుగా ఈ సినిమా కోసం సాయిపల్లవిని సంప్రదించారట కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందట.
అలాగే ఆ తర్వాత మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆ సినిమాను కూడా ఈ అమ్మడు సున్నితంగా తిరస్కరించిందట. అలాగే.. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కర్ణన్ (రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట ఈ న్యాచురల్ బ్యూటీ…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…