Featured

Actress Shiva Parvathi : రామ్ గోపాల్ వర్మనే కరెక్ట్.. కృష్ణంరాజు గారు చనిపోతే ఒకరోజు షూటింగ్ ఆపలేరా?? ఆయనకు కనీస గౌరవం ఇవ్వలేదు : నటి శివ పార్వతి

Actress Shiva Parvathi : తెలుగు వెండితెర మీద తల్లి పాత్రలలో దాదాపు 250 సినిమాలలో నటించిన శివ పార్వతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1991 లో రామానాయుడు నిర్మించిన పరుచూరి గోపాల కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సర్పయాగం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో శివ పార్వతి నటించగా… హీరోయిన్ తండ్రి పాత్రలో శోభన్ బాబు గారు నటించడం విశేషం. సర్పయాగం, ఒరేయ్ రిక్షా, మావి చిగురు, అన్నయ్య, సంక్రాంతి, శ్రీరామ రాజ్యం, శ్రీరామదాసు, సీమ సింహం మొదలైన సినిమాలలో నటించారు. సినిమాలలోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ పార్వతి గారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

రామ్ గోపాల్ వర్మ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను…

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు సంబందించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాటక రంగం యొక్క విశిష్టత గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో నాటక రంగం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలను జనంలోకి తీసుకు వెళ్ళడానికి ఒక మాద్యమం లాగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఏదైనా చెబితే వినడం కన్నా దృశ్యరూపంలో చూపిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇటీవల కృష్ణంరాజు గారు స్వర్గస్థులు అయినప్పుడు అర్జీవీ చేసిన ట్వీట్ గురించి అడిగితే తన అభిప్రాయాన్ని తెలియజేసారు.

ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను అని తెలియజేసారు. గొప్ప లెజెండ్రి నటుడు చనిపోతే కనీసం ఒక రోజు షూటింగులు ఆపి వారి మీద మనకు ఉన్న గౌరవం తెలియజేయడం మన బాధ్యత అని చెప్పారు. వారు జీవించినంత కాలం సినిమాల కోసమే పాటుబడ్డారు, అలాంటి వారు చనిపోతే ఒకరోజు కాకపోయినా సగం రోజు అయినా షూటింగులు ఆపాల్సిన్నింది అని చెప్పారు. మీరు ఈ విషయం గురించి అపుడు చెప్పలేదా అని అడుగగా ఇండస్ట్రీలో పెద్దవారికి చెప్పే స్థాయిలో నేను లేను, నిజాలు మాట్లాడుకోవాలి నేను మరి ఆ పొజిషన్లో లేను, నేను ఇలా చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం మాత్రమే చెప్పగలను అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago