Actress Sujitha:వదినమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బుల్లితెర నటి సుజిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వదినమ్మ సీరియల్ లో సీత పాత్రలో నటించిన సుజిత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన సుజిత తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందింది. ఆ సీరియల్ తర్వాత చాలాకాలం తెలుగు సీరియల్స్ కు దూరంగా ఉన్న సుజిత ఇటీవల మరొక సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బుల్లితెర నటి అయినప్పటికీ వెండితెర సెలబ్రెటీల స్థాయిలో మంచి క్రేజీ సంపాదించుకుంది. సుజిత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. షూటింగ్ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో సుజిత షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఎంతోమంది బుల్లితెర నటి నటులు సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. నవీన , శ్రీవాణి, మంజుల, హరిత వంటి ఎంతో మంది సీరియల్ నటీమణులు కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. ఇక తాజాగా సుజిత కూడా సొంతింటి కల నెరవేర్చుకుంది. తాజగా సుజిత నిర్మాత అయిన భర్త ధనుష్ తో కలిసి నూతన ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించింది.
Actress Sujitha: గేస్ ద ఈవెంట్..
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సుజిత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గేస్ ద ఈవెంట్ అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫోటోలలో సుజిత తన భర్త కుమారుడితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు నూతన ఇంట్లో గృహప్రవేశం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…