Categories: FeaturedMovie News

Actress Viji Chandrashekhar : అక్క సరిత ఎక్కడ ఉందంటే… సరిత గారి ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే…: నటి విజి చంద్రశేఖర్

Actress Viji chandrashekhar : తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్ని సౌత్ భాషల్లో నటిస్తూ గుర్తింపు అందుకున్న నటి సరిత గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మరో పక్క నటిగాను గుర్తింపు తెచ్చుకున్న సరిత గారి చెల్లి విజి చంద్రశేఖర్ కూడా నటి. అయితే తెలుగులో అఖండ సినిమా మాత్రమే చేసారు. అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లిగా నటించిన ఆమె ఆ సినిమా తరువాత తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే పలు తమిళ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చున్న ఆమె తమిళ సినిమాల్లో కొన్నిటిలో నటించారు. ఆమె నటించిన సీరియల్స్ లో ‘ఆరోహం’ అనే సీరియల్ కి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సరిత గారి పిల్లలు ఏం చేస్తున్నారంటే…

విజి చంద్రశేఖర్ అలాగే సరిత గారు తెలుగు వారే. వారి స్వస్థలం గుంటూరు కాగా చెన్నై లో స్థిరపడ్డారు. సరిత గారు విజి గారి సోదరి కాగా తాను దుబాయ్ లో స్థిరపడ్డారని చెప్పారు విజి. ఇక విజి గారికి ఇద్దరు ఆడపిల్లలు కాగా సరిత గారికి ఇద్దరు మగపిల్లలు. తను ఏ నాడు మగపిల్లలు కావాలని అనుకోలేదని, ఇద్దరు ఆడపిల్లలు కలగాలనే కోరుకున్నాను అంటూ చెప్తారు విజి.

తన అక్క పిల్లలను చిన్నపుడు పెంచడం వల్ల నాకు మగపిల్లలు ఉన్నట్టు కదా ఇంకెందుకు అనిపిస్తుంది అంటూ చెప్తారు. ప్రస్తుతం సరిత గారి పెద్దబ్బాయి, అలాగే తన పెద్ద కూతురు ఇద్దరూ కూడా మెడిసిన్ ఒకే కాలేజీలో చెస్తుండగా సరిత గారి చిన్నబ్బాయి ఏంబిఏ చేసాడని చెప్పారు. ఇక తన చిన్న కూతురు సినిమాల్లో నటించాలని అనుకుంటోందంటూ చెప్పారు. విజి గారి భర్తది ఊటి వైపు కాగా ఆయన ఎయిర్పోర్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వందల కోట్ల ఆస్తులున్న విజి గారు ప్రస్తుతం సినిమాల్లో మళ్ళీ నటించాలని అనుకుంటున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago