Featured

Adhire Abhi : వాళ్లకు నమ్మకం కలిగిన వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్స్ ఉంటాయి… నేనెపుడు తీసుకోలేదు : అదిరే అభి

Adhire Abhi : జబర్దస్త్ లో ఈ మధ్య కామెడీ కన్నా కిర్రాక్ ఆర్పి పుణ్యమా అని అక్కడ ఉన్న వివాదాలే హైలైట్ అవుతున్నాయి. అసలు జబర్దస్త్ లో ఏం జరుగుతోంది, ఆర్టిస్టులందరూ ఎందుకు వెళ్లిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. ఇక కిర్రాక్ ఆర్పి అక్కడ మనుషుల్లా మమ్మల్ని చూడరు, తిండి సరిగా ఉండదు, అవమానిస్తారు, ఇక ఆర్థిక సహాయాలు అసలే ఉండవు అన్న రేంజ్లో మాట్లాడేసాడు.

వారికి నమ్మకం కలిగిన వారికి అడ్వాన్స్ పేమెంట్స్ ఉంటాయి…

కిర్రాక్ ఆర్పి రాజేసిన అగ్గికి చలి కాచుకుంటోంది కొందరైతే మరి కొందరు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అలా జబర్దస్త్ వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నారు. అలానే అదిరే అభి కూడా ఈ మధ్య జబర్దస్త్ మానేసాడు. ఇక అక్కడి విషయాలను సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఇల్లు కట్టుకోడానికి శ్యామ్ ప్రసాద్ గారు సహాయం చేసారా అన్న ప్రశ్నకు అదిరే అభి మాట్లాడుతూ ఇంకో మూడేళ్లు వీళ్ళు ఎక్కడికీ వెళ్లరు మల్లెమాల సంస్థలోనే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగిన వారికి అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తారని అలా కొంతమందికి ఇచ్చారని చెప్పాడు.

అయితే తానెపుడూ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేదని, నాకు అప్పు చేయడం అంటే చాలా భయమని నిద్ర పట్టదని అందుకే జీవితంలో ఎవరితోనూ అప్పు చేయలేదని ఒకసారి తన కజిన్ తో తీసుకున్న ఆ మొత్తాన్ని నెలలోపు తీర్చేశానని అభి అన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో మాత్రం షెడ్యూల్ కి డబ్బులు ఇంటికి మల్లెమాల వాళ్ళు పంపారని షూటింగ్ లేకపోయినా నెక్స్ట్ షెడ్యూల్ డబ్బులు ఇచ్చారని చెప్పాడు అభి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago