Featured

Adhithi Shankar : హీరోయిన్ అవుతా అన్న డైరెక్టర్ కూతురు.. ఆ హీరోతో మాత్రం వద్దని షరతు పెట్టిన డైరెక్టర్..!

Adhithi Shankar : సినిమా ఇండస్ట్రీ లో వారసులు రావడం కామన్, దీన్నే ఇపుడు నెపోటిజం అంటూ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో ఈ వ్యతిరేకత ఎక్కువ ఉన్నా సౌత్ లో ఇంకా అంత లేదు. టాలీవుడ్, కొలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని సినిమా ఇండస్ట్రీలలోనూ హీరోల పిల్లలు, డైరెక్టర్ల పిల్లలు హీరోలుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలానే ఇపుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ కూతురు ఆదితి శంకర్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఆ హీరోతో మాత్రం అసలు చేయొద్దు…

హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడానికి కూతురికి శంకర్ షరతు పెట్టాడని టాక్ వినిపిస్తోంది. కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి రావడం శంకర్ నచ్చలేదట కాకపోతే కూతురు ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నారట, అది షరతులు పెట్టి. కార్తీ కి జంటగా ‘వీరుమన్’ సినిమాలో అవకాశం దక్కించుకున్న అధితికి ఆ సినిమా కనుక ప్లాప్ అయితే ఇక సినిమాల జోలికి వెళ్ళకూడదని షరతు విధించారట. ఇక ఒకవేళ ఆ సినిమా హిట్ అయి మంచి పేరు వస్తే నటన కొంసాగించవచ్చని చెప్పారట. ఇక ఇండస్ట్రీ లో తమిళ హీరో శింభూ తో మాత్రం నటించరాదని షరతు విధించారట. దీనికి కారణం ఆయనతో చేసిన హీరోయిన్స్ తో అఫైర్స్ పెట్టుకుంటాడనే రూమర్ ఉండడమే కారణం.

ఎంత సినిమా డైరెక్టర్ అయినా అయన కూడా ఒక తండ్రే కదా అందుకే అలా చెప్పుంటారని ఇపుడు అందరూ చర్చించుకుంటున్నారు. సినిమాల్లో హీరో హీరోయిన్స్ ల మధ్య అఫైర్స్ అంటూ చాలా మంది గురించి గాసిప్స్ రాస్తూ ఉంటారు. అయితే అందరి హీరోలు హీరోయిన్స్ మీద ఇలాంటివి ఉండవు కాకపోతే అలా ఒకరి మీద గోసిప్ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో శంకర్ గారి షరతు వల్ల అర్థమైపోతుంది. ఇక వీరుమన్ సినిమాలో కార్తీ సరసన నటించిన ఆదితి ఆ సినిమాలో నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అధితి నటనలోనే కాదు సింగింగ్ లోనూ తన టాలెంట్ ను నిరూపించుకుంది. ఆల్రెడీ సినిమాలో ఒక పాట పాడి అదరగొట్టింది.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

18 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

18 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

18 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

18 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

18 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

18 hours ago