చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయికుమార్ తనయుడు ఆది ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆది మొదట ‘ప్రేమ కావాలి’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన హిట్ దొరకలేదు ఆదికి. దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో ప్రస్తుతం తీస్ మార్ ఖాన్ చిత్రం తెరకెక్కుతోంది.
ప్రొడక్షన్ నెంబర్-3 గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. దసరా పండుగ రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినీ బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆది ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఫస్ట్ లుక్ లో అతడు సిగరెట్ కాలుస్తూ.. ఊర మాస్ లా కనిపించాడు. ఈ సినిమాలో అతడు రౌడీగా, పోలీస్ , స్టూడెంట్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత దర్శకుడిగా వహిస్తున్నాడు.
దీనికి సినమాటోగ్రఫిగా బాల్ రెడ్డి వహిస్తున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలు మణికాంత్ వ్యవహరిస్తున్నాడు. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంపై ఆ సినీ సభ్యులు పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి పాత్ర ఆది అంతకముందు సినిమాలో చేయలేదని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…