తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మహేశ్ బాబుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.
ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుందని టాక్. తాజాగా మహేశ్ బాబు ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను భవిష్యత్ లో నిర్మించబోయే ప్రతీ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తానెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తానని, బాలీవుడ్ లో ఏంట్రీ ఇవ్వడానికి రాజమౌళితో పాన్ ఇండియా చేయడానికి సిద్దంగా ఉన్నాను. ఈ చిత్రం అన్ని భాషల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాని తీస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.
ఈ సినిమా తర్వాత మహేష్ సినిమా కోసం వర్క్ చేస్తారా? లేక చిన్న సినిమా ఒకటి తీస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. సరైన కథ దొరికితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. ఇటీవల రాజమౌళి కూడా మహేష్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా మా నాన్న గారితో రాయించట్లేదు. వేరే రైటర్ తో రాయిస్తున్నాను అని తెలిపారు. సర్కారు వారి పాట తర్వాత మహేశ్ త్రివిక్రమ్ తో తీస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం క్లారిటీ లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…