చెరువులో మునిగి తల్లీకూతరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక ముండల పరిధిలోని ఎనగుర్తి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది.
అక్కడ రోజా బట్టలు ఉతుకుతుండగా.. చిన్న కుమార్తె చైత్ర (5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతుకు వెళ్లిపోయింది. అది చూసిన తల్లి కంగారు పడి.. తన చీరను అందించింది. కానీ చైత్ర ఆ చీరను అందుకోలేకపోయింది. దీంతో ఆమె కూడా కొంచెం దూరం జరుగుతూ.. నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది.
కానీ ఆమెకు కూడా ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనను చూసిన ఆ చెరువు గట్టుపై ఉన్న రోజా పెద్ద కుమార్తె సౌజన్య(8), మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద పనులు చేస్తున్న రైతులు హుటాహుటినా వచ్చారు.
నీటిలో మునిగిన రోజా, చైత్ర మృతదేహాలను బయటకు తీశారు. తల్లి, చెల్లి మృత దేహాలను చూసి సౌజన్య రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్‌తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. అనాథగా మారిన సౌజన్యను చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…