చెరువులో మునిగి తల్లీ కూతురు మృతి.. మరో కూతురి రోధన కంటతడి పెట్టించింది..

0
143

చెరువులో మునిగి తల్లీకూతరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక ముండల పరిధిలోని ఎనగుర్తి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది.

అక్కడ రోజా బట్టలు ఉతుకుతుండగా.. చిన్న కుమార్తె చైత్ర (5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతుకు వెళ్లిపోయింది. అది చూసిన తల్లి కంగారు పడి.. తన చీరను అందించింది. కానీ చైత్ర ఆ చీరను అందుకోలేకపోయింది. దీంతో ఆమె కూడా కొంచెం దూరం జరుగుతూ.. నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది.

కానీ ఆమెకు కూడా ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనను చూసిన ఆ చెరువు గట్టుపై ఉన్న రోజా పెద్ద కుమార్తె సౌజన్య(8), మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద పనులు చేస్తున్న రైతులు హుటాహుటినా వచ్చారు.

నీటిలో మునిగిన రోజా, చైత్ర మృతదేహాలను బయటకు తీశారు. తల్లి, చెల్లి మృత దేహాలను చూసి సౌజన్య రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్‌తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. అనాథగా మారిన సౌజన్యను చూసి ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here