కొన్ని రోజుల కిందట బైక్ ప్రమాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అతడు ఆసుపత్రిని నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 35 రోజుల పాటు అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నాడు.
ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకొని అతడు ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ఇలా ఉన్నారు. ‘అనుకోకుండా ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి కోలుకొని క్షేమంగా ఇంటికి చేరాడు.. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడ్డారు’ అని అన్నాడు.అలాగే తేజ్ ఆరోగ్యంగా ఉండాలని.. ఆలయాల్లో పూజలు చేసి.. ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ పవన్ చెప్పుకొచ్చాడు.
వారి పూజలు ఫలించాయని పేర్కొన్నాడు. తేజ్ క్షేమంగా తిరిగి ఇంటికి రావడంపై మెగా అభిమానులు, మెగా బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేశారు. అది పండుగ రోజు ఇంటికి రావడంతో ఆ ఆనందం ఇంకా రెంట్టింపు అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…